‘మన్మథుడు2’ రకూల్ హాట్ గా చించేసింది!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మధుడు’మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సృస్టించింది. ఈ సినిమా నాగ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా చెబుతారు. అయితే ఈ మూవీ సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా సందర్భం మాత్రం కలిసి రాలేదట. తాజాగా యంగ్ డైరెక్టర్ రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ సీక్వెల్ రూపొందుతుంది.

మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను వదిలారు. నాగార్జున్ 25 కుర్రాడిలా రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లు పండించారు. ఇక ఈ సినిమాలో రకుల్ పేరు అవంతిక. ఈ అమ్మాయిని చూసిన లక్ష్మి.. ‘అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది. అంతే పద్ధతి గల అమ్మాయి’ అని చాలా ఇష్టపడుతుంది. కానీ, వాస్తవానికి అవంతిక అంత పద్ధతి గల అమ్మాయేంకాదు. అల్లరి పిల్ల. మొదట ‘యు’ సర్టిఫికెట్ ప్రయోగిస్తుంది. పనికాకపోతే ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తుంది.

‘ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది సర్’ అని నాగార్జునతో వెన్నెల కిషోర్ అంటాడు. వెంటనే నాగార్జున ‘బొంగేంకాదు’ అని తీసిపారేస్తాడు. ‘ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్‌లు తట్టుకోలేవు’ అని నాగార్జునతో రకుల్ అనగానే ఆయన హావభావాలు భలే ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ కామెడీ తోపాటు మంచి లవ్ సీన్లు, ఎమోషన్ సీన్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటిస్తుంది.

Share.