అడివి శేష్ ” ఎవరు ” ప్రీ లుక్ రిలీజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

అడవి శేషు హీరోగా నటిస్తున్న చిత్రం ఎవరు. ఈచిత్రం చడిచప్పుడు కాకుండా తెరకెక్కించారు చిత్రయూనిట్. ఎక్కడ కొంచెంకూడా పసిగట్టకుండా అడవి శేషు సినిమాను కానిచ్చాడు. ఎవరు ను ఎవ్వరికి తెలియకుండా నిర్మించి ఇప్పుడు చిత్రానికి సంబంధించిన విశేషాలను విడుదల చేస్తున్నారు అడవి శేషు.

అడవి శేషు గూడాచారి సినిమాలో తన నటనను రుచి చూపించారు. నటనకు స్కోప్ ఉన్న గూడాచారి సినిమాలో అడవి శేషు నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఎవరు సినిమాలో ఓ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నట్లు ప్రీ లుక్లో తెలుస్తుంది. అడవి శేషు ఓ పోలీసాఫీసర్ యూనిఫామ్లో ఉన్నాడు. ఇక పోలీస్ యూనీఫార్మ్ మీద విక్రమ్ వాసుదేవ్ అనే పేరుతో ఉంది. అంటే విక్రమ్ వాసుదేవ్ పాత్రలో అడవి శేషు నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఇదే ఫ్రీ లుక్లో కంటికి చలువద్దాలు ధరించి, జీరో సైజు గడ్డంతో ఓ ఫవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈనెల 11న విడుదల చేస్తున్నట్లు ఫ్రీ లుక్లో స్పష్టం చేశాడు. ఈసినిమాను ప్రతిష్టాత్మక సంస్థ పీవీపీ సినిమాస్ నిర్మిస్తుంది. వెంకట్ రామ్జీ దర్శకత్వం వహిస్తుండగా, పెరమ్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కేవిన్ అన్నే నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

Share.