ఈ మద్య సెలబ్రెటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. బాలీవుడ్ లో అయితే స్టార్ హీరోయిన్లు వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్ నటీమణులు, టివి నటీ,నటులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
తాజాగా తెలుగు టివి నటి, యాంకర్ అస్మిత వివాహం చేసుకుంది. తెలుగు టెలివిజన్‌లో ప్రసారమైన పద్మవ్యుహం, మనసు మమత, పంజరం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాహలక్ష్మి వంటి సీరియల్స్‌లో మంచి పాత్రలను పోశించి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది అస్మిత. గత కొంత కాలంగా కొరియోగ్రాఫర్ సుధీర్ తో ప్రేమాయణం సాగించిన ఈమె పెద్దలను ఒప్పించి ఒక ఇంటి వారు అయ్యారు.
ఇటీవల వీరిద్దరి వివాహం జరగగా శనివారం రోజున వీరి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. అయితే వీరి రిసెప్షన్ కి చాలా మంది టీవీ నటులు, యాంకర్లు హాజరయి నూతన వధువరులను ఆశీర్వదించారు. కేవలం బుల్లితెరపైనే కాదు వెండి తెరపై మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య వంటి సినిమాలలో కూడా నటించింది.