అల్లు అర్జున్ అలిగాడు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ అందరితో సరదగా ఉంటాడు. చిన్నపెద్దా అనే తారతమ్య బేధం లేకుండా ప్రతి ఒక్కరితో ఎంతో కలుపుగోలుగా ఉండే హీరో అల్లు అర్జున్. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటాడో, తన స్టాఫ్ తో అదే విధంగా ఉంటాడని అందరు అంటుంటారు. అలాంటి అల్లు అర్జున్ కు తన స్టాఫ్ పై కోపం వచ్చిందట. అంతేనా వారిపై అలిగాడాట.స్టాఫ్ పై కోపం రావడం, వారిపై అలక ఎందుకు అనే కదా మీఅనుమానం. అసలేం జరిగిందంటే…

ఆదివారం వచ్చిందంటే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం కెటాయిస్తాడట. తన స్టాఫ్ కు కూడా ఆదివారం వస్తే సెలవేనట. అయితే అల్లు అర్జున్ ఆదివారం ఇంట్లో ఉండటంతో తన స్టాఫ్ చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకుని రిలాక్స్ అవుతారట. ఈ విషయం అల్లు అర్జున్ స్టాఫ్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నఫోటోలతో తెలిసింది అల్లు అర్జున్ కు. ఇక చేసేదేమున్నది… వెంటనే స్టాఫ్ పై అలిగాడాట… కోపమంటే.. నిజమైన కోపం కాదు…ఓ అలకలాంటి కోపమట..

అల్లు అర్జున్ స్టాఫ్ పార్టీ చేసుకున్న ఫోటోను శరత్ చంద్ర అనే సిబ్బంది తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేసాడు. ఇది చూసిన అర్జున్ ఆదివారం వస్తే నాకన్నా నా స్టాఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నా జీవితం కన్నా వాళ్ళ జీవితాలే సంతోషంగా సాగిపోతున్నాయని పోస్టు చేసాడు. ఇంకా నన్ను కూడా పార్టీకి పిలువొచ్చు కదా అని బన్నీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

Share.