టాలీవుడ్‌లో ఆగస్టు నుంచి పెద్ద సినిమాల పండగ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15న ప్రభాస్ సాహో వస్తుంటే… దసరాకు మెగాస్టార్ సైరా కాచుకొని కూర్చుని ఉంది. ఆగస్టు 15న సాహో వస్తే ఆ సినిమాకు టాక్ ను బట్టి కనీసం నెల రోజుల పాటు మంచి వసూళ్లు ఉంటాయి. ఆగస్టు నెలలో సాహో కు ఎదురుగా వెళ్లేందుకు ఏ పెద్ద సినిమా కూడా సాహసం చేయడం లేదు. ఈ క్రమంలోనే మీడియం రేంజ్ హీరోల సినిమాలు అన్ని సాహో కు ముందే షెడ్యూల్ చేసుకుంటున్నాయి. అయితే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువగా ఉండటం…. టైం తక్కువగా ఉండడంతో కొన్ని సినిమాలకు క్లాష్ తప్పటం లేదు.
ఈ క్రమంలోనే చాలా మంది ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలకు పోటీగా కాకుండా శర్వానంద్ రణరంగం మీద పడ్డారు. పలుసార్లు వాయిదాలు పడిన బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు ఆగస్ట్ 2న రణరంగంతో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అంటే ఆ రోజు శర్వానంద్ వర్సెస్ సాయి శ్రీనివాస్ మధ్య పోరు తప్పదు. ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న గుణ 369 రిలీజ్ కూడా అదే డేట్‌కి ఫిక్స్ అయింది.
ఈ మూడు సినిమాల్లో శర్వానంద్ సినిమాకే ప్రి రిలీజ్ ఎడ్జ్ ఉన్నా ఎంతైనా పోటీ పోటీయే. కొన్ని థియేటర్లు వాళ్లు కూడా ఆక్రమిస్తారు. ఎంతోకొంత ఓపెనింగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో శర్వానంద్ సినిమాలని పెద్ద హీరోల సినిమాలతో పోటీగా విడుదల చేసేవారు. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలతో భారీ సినిమాలకి ఎదురెళ్లి మరీ శర్వానంద్ విజయం సాధించాడు.
అయితే ఇప్పుడ రామ్, విజయ్ సినిమాలకు పోటీగా కాకుండా బెల్లంకొండ, కార్తీకేయ లాంటి వాళ్లు శర్వానంద్‌తో సై అనడమే కాస్త షాకింగ్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా అందరూ శర్వానంద్ మీద పడ్డారు. అయితే కంటెంట్‌లో దమ్ముంటే సినిమాతో హిట్ కొట్టడం మనోడికి పెద్ద కష్టం కాదు.