ఓ బేబీ ప్రిమియర్ షో కలెక్షన్స్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఇప్పుడు ఓ బేబీ సినిమా గురించిన చర్చలే. అసలు ఓ బేబీ సినిమా ఎంత వసూలు చేస్తుంది అన్న లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు టాలీవుడ్లో కొందరు. అయితే అందరు ఊహించని విధంగా ఓ బేబీ రికార్డు కలెక్షన్లను సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు అందరిలో కలుగుతుంది. సురేష్ ప్రొడక్షన్ ఆధినేత దగ్గుబాటి సురేష్ బాబు అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఆయన పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడి ఇప్పటికే పూర్తి కాగా, ఇక లాభాలు రాబట్టడం మిగిలింది.

సమంత నటించిన ఓ బేబీ చిత్రం ఇప్పడు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్ళు రాబడుతుంది. అందుకు నిదర్శనం ఓ బేబీ సినిమా ఓవర్సీస్ లో ప్రిమియర్ షో కు వచ్చిన కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రిమియర్ షోతో 1,45,135 డాలర్లను వసూలు చేసిందట. అంటే ప్రిమియర్ షోతో కేవలం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం సాధించిన కలెక్షన్లు రికార్డుగానే చెప్పుకోవచ్చు.

సమంత గా ఉన్నప్పుడు అన్ని హీరో ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అక్కినేని ఇంటికోడలు అయిన తరువాత ఇక సమంతకు ఎదురే లేకుండా పోయింది టాలీవుడ్లో. అటు సమంత అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారట. ఇక సురేష్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అంటే దాన్ని ప్రత్యేకంగా చూసే వారు లేకపోలేదు. సో ఇటు సురేష్ ప్రొడక్షన్ అభిమానులు కూడా జత కావడంతో ఓ బేబీ సినిమా వసూళ్ళు భారీగానే ఉండనున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుడంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Share.