తెలుగులో తొలి రెండు సీజన్లలోనూ బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన బిగ్ బాస్ మూడో సీజన్ ఈ నెల 21నుంచి ప్రారంభమవుతోంది. తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. మూడో సీజన్కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జున హోస్ట్గా చేసే ప్రోమోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గతంలో నాగార్జున ఈ షోపై చేసిన విమర్శలను ఇప్పుడు ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మొత్తం 100 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. నాగార్జునకు ఈ సీజన్ మొత్తానికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్కు రూ. 12 లక్షల రూపాయలు నాగార్జున కి ముట్టనున్నాయట.
అంటే మొత్తం సీజన్ కంప్లీట్ అయ్యే వరకు నాగ్కు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ అందనుంది. ఈ సీజన్లో హౌస్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. మొదటి ఎపిసోడ్ ఈనెల 21 వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ సారి కంటెస్టెంట్ల లిస్టులో ఎవ్వరూ ఊహించని పేర్లు ఉండనున్నాయట. టాలీవుడ్ యంగ్ హీరోతో పాటు అతడి భార్య కూడా హౌస్లో ఉంటారని వార్తలు వస్తున్నాయి.