అల్లరి నరేష్… ఈ పేరుకు పరిచయం అక్కరలేని పేరు. కాని నవ్వుల హీరోగా టాలీవుడ్లో అనేక సినిమాలల్లో నటించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన జోరును తగ్గించాడు. కాకుంటే మల్టీస్టారర్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అయితే అల్లరి నరేష్ తన నటనతో బాలయ్య నే తలదన్నేందుకు ఆయనతోనే పోటీ పడుతున్నాడు. ఇంతకు బాలయ్యతో అల్లరి నరేష్ పోటీ అంటే అది సాధ్యమేనా అనేది అనుమానం అయినప్పటికి తప్పడం లేదు.
అల్లరి నరేష్ ఎక్కవుగా తన సినిమాల్లో రీమిక్స్ పాటలను వాడుతుంటాడు. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో ప్రేక్షకాధరణ పొందిన పాటలను ఎంపిక చేసుకుంటూ వాటిని తన సినిమాల్లో రీమిక్స్ చేస్తూ టాప్ హీరోలను ఇమిటేట్ చేయడం సర్వసాధారణం అయింది నరేష్‌కు. టాలీవుడ్లో అనేక మంది హీరోలు రీమిక్స్ సాంగ్స్ చేస్తూ తన స్టామినాను నిరూపించుకుంటున్నారు.
ఇటీవల కాలంలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు పలువురు టాప్ హీరోలు కూడా రీమిక్స్ సాంగ్స్ చేస్తూన్నారు. అయితే వీరంతా అల్లరి నరేష్ కన్నా వెనుక వరుసలోనే ఉంటారు. ఎందుకంటే టాలీవుడ్లో రీమిక్స్ సాంగ్స్ చేసింది ఎక్కువగా అల్లరి నరేష్‌దే. ఇప్పుడు బాలయ్య నటించిన బంగారు బుల్లోడు సినిమానే పేరునే వాడుకుంటున్నాడు. అదే విధంగా ఆయన సినిమాలోని ఎంతో ప్రేక్షకాధరణ పొందిన వానలో పాడుకునే పాట స్వాతిలో ముత్యమంత అనే పాటను కూడా రీమిక్స్ చేస్తున్నాడ. సో బాలయ్య చేసినట్లుగా నరేష్ చేస్తాడా లేదా అనేది ఇద్దరి మద్య ఉన్న పోటీ.