సైరా క‌న్న‌డ రైట్స్ ఇంత కాస్ట్‌లీనా…

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా గాంధీజ‌యంతి కానుక‌గా సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. చిరు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమా బిజినెస్ డీల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సైరా న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే సైరా కన్నడ వెర్షన్ హక్కుల గురించి ఓ సెన్సేషన్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఓ ఓ ప్ర‌ముఖ పంపిణీ సంస్థ సైరాను క‌న్న‌డ‌లో రిలీజ్ చేసేందుకు రూ.30 కోట్లు చెల్లించేందుకు ముందుకు వ‌చ్చింద‌ని.. ఈ డీల్ దాదాపు ఓకే అయ్యింద‌ని అంటున్నారు. తెలుగు సినిమాలకు కన్నడ మార్కెట్ మరీ అంత పెద్దదేమీ కాదు. ఎంత మెగాస్టార్ అయినా సైరాకు క‌న్న‌డ‌లో రూ.30 కోట్లు అంటే చాలా ఎక్కువే.

రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాకు అక్క‌డ కోట్లాది రూపాయ‌లు వ‌సూళ్లు వ‌చ్చాయంటే ఆ సినిమా క్రేజ్ వేరు. ఇప్పుడు బాహుబ‌లితో పోలిస్తే అంత క్రేజ్ సైరాకు లేదు. ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే సైరాకు హైప్ తీసుకువ‌చ్చేందుకు ఎక్కువ రేట్ల‌కు అమ్మిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. సైరాలో హీరోయిన్స్ గా నయనతార,తమన్నా నటిస్తుండగా,అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

Share.