రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రతి అప్డేట్ అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆ.ఆర్.ఆర్. రియల్ లైఫ్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం 3వ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా నుండి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇద్దరు హీరోలు.. తారక్, చరణ్ ఇద్దరి ఎంట్రీ సీన్, సాంగ్ కోసం ఏకంగా 3 కోట్లను పెడుతున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవట్లేదని తెలుస్తుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగష్టు 15న వస్తుందని తెలుస్తుంది.
రాజమౌళి, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. బాహుబలిలా ఉంటుందా లేక దాన్ని మించి సంచలనాలు సృష్టిస్తుందా అన్నది చూడాలి.