వివాదంలో సైరా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మొదటితరం సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. రామ్చరణ్ మేనేజర్ చేసిన నిర్వాకం ఇప్పుడు నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతుంది. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ధర్నాకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో సైరా సినిమా వివాదంలో చిక్కుకున్నట్లేనా అనేది ప్రశ్నగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం ను రామ్ చరణ్ తన సొంత భ్యానర్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ పై నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రంకు సంబంధించిన డబ్బింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమా విడుదలకు సన్నద్ధం జరుపుకుంటున్న తరుణంలో సైరా మేనేజర్కు నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల నడుమ వివాదం రాజుకుంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను రామ్ చరణ్ గతంలో కలిసి ఈ కథను ఎవరికి ఇవ్వవద్దని అగ్రిమెంట్ రాయించుకున్నాడట. అప్పుడు మీ కుటుంబానికి అండగా మేముంటాము… మీ ఇంటిని కూడా షూటింగ్ కోసం వాడుకుంటామని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో రామ్చరణ్ను కలవాలని ఫోన్చేస్తే మేనేజర్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదని ఫోన్లో ధబాయించాడని, ఓ రేంజ్లో బెదిరించాడని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళన దిగిందడం కలకలం రేగింది. ఇది కావాలని మధ్యలోల్లే కావాలని చేస్తున్నారని నరసింహారెడ్డి బందువులు అంటుండగా, ఇంకా చిరంజీవి, రామ్ చరణ్ ఎవరు దీనిపై స్పందించలేదు. సో సైరా సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఇది ఎటువైపు దారితీస్తుందో కాలమో నిర్ణయించాలి.

Share.