బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఆ సినిమాల మార్కెట్ కంటిన్యూ చేసే క్రమంలో సాహోతో భారీ రిస్క్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా రిలీజ్కు ఇంకా 45 రోజుల టైం మాత్రమే ఉంది. ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు ఫినిష్ అవ్వలేదు. ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కాకపోవడంతో ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. బాహుబలి ప్రమోషన్ల విషయంలో రాజమౌళి పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్లారు. దేశవ్యాప్తంగా అందరూ ఆ సినిమా గురించి చర్చించుకునేలా చేశారు.
మరి ఇప్పుడు సాహో ప్రమోషన్ల విషయంలో ఎవ్వరూ ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ముంబై మీడియాతో సినిమా విషయాలు షేర్ చేసుకుంటున్నా.. తెలుగులో కనీసం పీఆర్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం లేదని తెలుగు మీడియా గుర్రుగా ఉంది. తమిళ్లోనూ అదే పరిస్థితి. రాజమౌళి బాహుబలి ప్రమోషన్లోనే సగం సక్సెస్ అయ్యాడు.
మరి సుజీత్ సాహో రిలీజ్డేట్ దగ్గర పడుతున్నా ఈ విషయంపై ఎందుకు కేర్ తీసుకోవడం లేదు. ఎందుకు ప్రమోషన్లతో పాటు తెలుగు మీడియాకు అప్డేట్ ఇచ్చే విషయంలో ఎస్కేప్ అవుతున్నారు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ చేసే రిలీజ్ టైంకు సినిమా వాళ్లు మాత్రం సాహోను ఎందుకు ప్రమోట్ చేస్తారన్న టాక్ కూడా వస్తోంది.