కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా వస్తున్న సినిమా ఓ బేబీ. ఈ సినిమా ఫ్రీరీలిజ్ బిజినెస్ భారీ స్ఠాయిలోనే జరిగిందనే చెప్పొచ్చు. లేడి ఓరియెంటెడ్‌తో వస్తున్న ఈసినిమాను ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో విడుదల కానున్నది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలిజ్ బిజినెస్ అనుకున్న దానికన్నా అధికంగానే జరిగినట్లు చిత్ర యూనిట్ వర్గాల కథనం.
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ఓ బేబీ. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం చాలా రోజుల ముందు నుండే సాగుతుంది. పెద్ద ఎత్తున్న చిత్ర ప్రమోషన్ జరుగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు చిత్ర నిర్మాణ సంస్థ. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ రిలిజ్ బిజినేస్సే అనుకున్న దానికన్నా ఎక్కువే అయినట్లు తెలిసంది.
ఈ సినిమా ఓవర్సీస్ రైట్‌తో రూ. 1.75కోట్లు, నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం నుంచి రూ.3కోట్లు, కర్నాటక హక్కులు రూ.75లక్షలు, శాటిలైట్ హక్కులు రూ.2కోట్ల మేరకు బిజినెస్ జరిగిందట. ఇంకా హింది వెర్షన్ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో రూ.3కోట్ల వరకు వచ్చాయి. మొత్తానికి ఇప్పటికే రూ.10.50కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సో ఇప్పటికే రూ.13కోట్లతో సినిమాను రూపొందిస్తే ఫ్రీ రిలిజ్ బిజినెస్‌తోనే అది పూర్తి కావడంతో ఇక చిత్రం విడుదల అయితే వచ్చేది లాభాలే. ఆంధ్ర, నైజాం, హక్కలు చేతిలో ఉండగానే, తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత సురేష్‌బాబు నేరుగా సినిమాను విడుదల చేయనున్నందున సినిమా లాభాల పంట పండిస్తుందని చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. సో సమంతా బేబీతో ఓ బేబీ సినిమా లాభాలు పండినట్లే.