టాలీవుడ్ అందాల భామ హాలీవుడ్‌కు చెక్కేసిందోచ్… తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ అందాల భామ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అభిమానులకు హ్యండీచ్చి హాలీవుడ్‌కు చెక్కెయడంతో అభిమానులు బోరుమంటున్నారు. ఇంతకు హాలీవుడ్‌కు చెక్కెస్తేస్తున్న అందాలభామ ఎవరనే కదా మీ డౌట్. విశ్వ విఖ్యాత నటుడు కమలహాసన్ ముద్దుల తనయ శృతిహాసన్.
శృతిహాసన్ కోలీవుడ్‌లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని చిత్రాల్లోనూ శృతిహాసన్ నటించింది. టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కళ్యాన్‌తో గబ్బర్ సింగ్‌లో శృతిహాసన్ ఆడిపాడిన నటనను ఎవరు మరిచిపోనిది. ఇక ఇదే పవన్‌తో కాటమరాయుడులోనూ నటించింది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు తోనూ శృతిహాసన్ జతకట్టింది. శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ నటన అద్భుతం. ఇక టాలీవుడ్లో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజతో పాటు పలువురు హీరోల సరసన నటించింది.
శృతిహాసన్ సిని కేరీర్ జోరుగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆకస్మీకంగా సినిమాలకు విరామం ప్రకటించారు. మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన శృతిహాసన్ వివాహం చేసుకోవాలనే ఆలోచనతో సినిమాలకు విరామం ప్రకటించి లండన్ వెళ్ళిపోయింది. అక్కడే కొన్ని లైవ్ మ్యూజిక్ షోలలో పాల్గొనడంతో ఆమేపై హాలీవుడ్ పెద్దల కన్ను పడిందట. ఇక అంతే ఆమేను హాలీవుడ్లో నటింపజేసేందుకు సన్నహాలు చేశారట. దీంతో ఆమే ఓ హాలీవుడ్ ప్రాజెక్టుతో డీల్ కుదిరిందట. యు ఎస్ ఏ నెట్వర్క్ నిర్మిస్తున్న ట్రెండ్ స్టోన్ సిరీస్‌లో ఓ కీలక పాత్రకోసం నిర్మాతలు సంప్రదించారట. అదే విధంగా జేసన్ బౌర్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమాలోనూ ఓ కిల్లర్ పాత్ర లో శృతిహాసన్ నటించనున్నారట. ఈ చిత్రానికి రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నారట. చిత్రానికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ అమెరికా, భారత్‌లో జరుపుతారట.