అసెంబ్లీలో చంద్రబాబు ‘బ్రహ్మానందం’అయ్యాడు : రాంగోపాల్ వర్మ సెటైర్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ పై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఒక దశలో రాంగోపాల్ వర్మను విజయవాడలో అరెస్ట్ కూడా చేశారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు ని పూర్తి స్థాయిలో విలన్ గా చూపించారని..టీడీపీ శ్రేణులు కేసు వేశారు.

సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. అంతలోనే ఎన్నికలు రావడం ఈసీ సైతం ఈ సినిమా రిలీజ్ కి అభ్యంతరం తెలిపింది. మొత్తానికి ఏపిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు ఏపిలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా మరోసారి విసుర్లు విసిరారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా, ఆయన్ను నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారనీ, ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు.ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారని..దాని వెనుక అసలు అర్ధం ఆయన మాట్లాడుతుంటే కామెడీ కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం లా అనిపిస్తున్నారని చమత్కరించారు.

Share.