చైతూ-శేఖర్ కమ్ముల మూవీ కన్ఫామ్!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీలత అనేది కనిపించదు. హీరోయిన్లకు కూడా తగిన గౌరవం ఇస్తుంటారు. ఆ మద్య వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. హ్యాపీడేస్ తో మొదలైన ఆయన ప్రస్థానం ‘ఫిదా’వరకు సాగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏ హీరో అయినా సంతోషంగా నటిస్తుంటారు.

తాజాగా చైతూ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయనున్నాడనీ, కథానాయికగా సాయిపల్లవి ఎంపిక జరిగిపోయిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. కాకపోతే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు..తాజాగా ఈ వార్త నిజమేననే విషయం తాజాగా స్పష్టమైపోయింది. శేఖర్ కమ్ముల – చైతూ కాంబినేషన్ లోని సినిమా నిజమేనంటూ ఒక ప్రకటన వచ్చేసింది.

హీరోయిన్ గా సాయిపల్లవినే ఖరారు చేసేశారు. అంతే కాదు రెగ్యులర్ షూటింగును సెప్టెంబర్ మొదటివారంలో మొదలెట్టనున్నారు. డిసెంబర్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ‘ఫిదా’ తరువాత శేఖర్ కమ్ములతో సాయిపల్లవి చేస్తోన్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

Share.