ప్రభాస్ బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత సాహో సినిమా చేస్తాడని అందరూ ఎనౌన్స్ చేసినప్పుడే తెలుగు సినిమా అభిమానులు అందరూ ఫుల్ ఖుషీ ఫీలయ్యారు. అదిరిపోయే యాక్షన్ సినిమా చూస్తున్నామని వారు అప్పటి నుంచే ఊహాలోహాల్లో విహరించడం స్టార్ట్ చేశారు. సాహోకు బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులోకి ఎంటర్ అవుతున్నారని… వీరి మ్యూజిక్ విని ఫుల్ ఖుషీ అవ్వొచ్చని అనుకున్నారు.
ఈ సంగీత త్రయం కొన్ని పాటలకు మ్యూజిక్ ఇచ్చి రీ రికార్డింగ్కు కూడా పంపారు. అంతలోనే ఏమైందో గాని వీరు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన వచ్చింది. దీంతో అసలు సాహోకు ఎవరు ? మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఎవ్వరికి క్లారిటీ లేదు. ఈ విషయంలో లెక్కలేనన్ని డౌట్లు రైజ్ అయ్యాయి. చివరకు చిత్ర యూనిట్ ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సాహోకు నేపథ్య సంగీతం అందిస్తారు అని చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉన్నా సాహోకు అసలు ఆడియో ఆల్బమ్ ఎవరు చేస్తున్నారు ? అన్నది మాత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇంటర్నల్గా మాత్రం ఎవరో హిందీ వాళ్లు పాటలకు మ్యూజిక్ ఇస్తున్నారట అని మాత్రం చెపుతున్నారు. హిందీ వాళ్లు మన తెలుగు సినిమాలకు ఇచ్చిన ఆడియోల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అందుకే వాళ్ల పేర్లు చెపితే మన గాసిప్ రాయుళ్లు ముందుగానే నెగిటివిటీ వార్తలు రాసి.. ప్రచారం చేస్తారనే చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు బయటకు రానియ్యలేదని తెలుస్తోంది. అందుకే సాహో విషయంలో పాటలు ఎవరు ? ఇస్తున్నారన్నది ఒక్కటి మాత్రం కన్ఫ్యూజింగ్ గానే ఉంది.