ఆ మద్య బ ాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది. తనూ శ్రీదత్త తనపై లైంగిక దాడిచేశారని ప్రముఖ నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసింది. ఇక దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి తపపై పది సంవత్సరాల క్రితం రచయిత వైర ముత్తు దాడి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఇలా మహిళలపై ఏ ఇబ్బంది వచ్చిన స్పందించే చిన్మయి పై ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అసలు విషయానికి వస్తే..ఆ మద్య ”వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోజరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?” అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఇప్పుడు ఆమె భర్త తీస్తున్న మూవీ ‘మన్మధుడు2’లో నాగ్ చేసిన రొమాన్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
నాగార్జున వయసు 59 తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో లిప్ లాక్ రెచ్చిపోయాడు. ఇప్పుడేమంటావ్.. అంటూ నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి ఇప్పుడు తన భర్త అలాంటి పనులు చేస్తుంటే ప్రోత్సహిస్తుందని ఆమెని ట్రోల్ చేస్తున్నారు.