టాలీవుడ్ లో బాహుబలి 2తర్వాత ప్రభాస్ క్రేజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడే కాదు యావత్ భారత దేశంలో ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. బాహుబలి 2 తర్వాత ఆయనకు జాతీయ స్థాయిలో ఎంతో మంచి పేరు వచ్చింది. దాంతో ప్రభాస్ నటించే మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ రేంజ్ కి తగ్గట్లు ఆయన నటిస్తున్న ‘సాహూ’ సినిమా టీజర్ అనుకున్న సమయానికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
హాలీవుడ్ ప్రమాణాలు ఏ మాత్రం తక్కువ కాకుండా టీజర్ ను కట్ చేశారు. కేవలం యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టి టీజర్ ను కట్ చేసిన విధానం బాగుంది. పెట్టిన ఖర్చుకు ఫలితం టీజర్ లో స్పష్టంగా కనిపించింది.సినిమా టీజర్ విజువల్ పరంగా వండర్ అనిపించే విధంగా ఉండటం విశేషం. టీజర్ సినిమాపై నమ్మకం కలిగించింది.
తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రభాస్ లుక్ .. ఆయన కాస్ట్యూమ్స్ .. ఆయన వాడిన బైక్ .. శ్రద్ధా కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.