మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. తమిళ హీరో అధర్వ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దె ఓ కృషియల్ రోల్ ప్లే చేస్తుండగా మరో తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కృష్ణ మంజూషని వాల్మీకిలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.
సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఆమె కొన్ని వీడియోస్ చేసిందట. ఆమె టాలెంట్ నచ్చి ఈ సినిమాలో రోల్ కి ఆమె పర్ఫెక్ట్ అని కృష్ణ మంజూషని సెలెక్ట్ చేశారట. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి ఎఫ్-2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు.
ఇక ఇదే కాకుండా తన తర్వాత సినిమా నూతన దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ యూఎస్ వెళ్లి మరి స్పెషల్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మెగా హీరోల్లో మిగతా వాళ్లు ఎలా ఉన్నా వరుణ్ తేజ్ మాత్రం సరికొత్త ప్రయోగాలతో సంచలనం సృష్టిస్తున్నాడు.