ఇడియట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మాస్ ఇమేజ్ తో వరుస విజయాలు అందుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. వరుస విజయాలతో తనకు ఎదురు లేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అపజయాలు ఎదురుయ్యాయి. పవర్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకున్న రవితేజ రెండు సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో రీ ఎంట్రీ దుమ్మురేపాడు. మరోసారి తన సత్తా ఏంటో చూపించిన రవితేజ మళ్లీ వరుస అపజయాలు చవిచూశాడు. ఇదే సమయంలో యువ హీరోలు పోటీకి రావడంతో తనకు తప్పని సరి ఓ హిట్ సినిమా పడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి . ఈ నేపథ్యంలోనే మాస్ మహరాజ కోసం అజయ్ భూపతి ‘మహాసముద్రం’ అనే కథను సిద్ధం చేసుకున్నాడు. మొదట నాగచైతన్యతో ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు.
కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో, రవితేజను ఒప్పించాడు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చేస్తోన్న రవితేజ ఈ షూటింగ్ పూర్తి కాగానా అజయ్ భూపతితో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.