అందుకే అటువంటి సీన్లో నటించా!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మద్య కొత్తగా వస్తున్న హీరోయిన్లు గ్లామర్ డోస్ బాగానే పెంచేస్తున్నారు. ఎంత బోల్డ్ గా నటిస్తే వారికి అంతగా ఛాన్సులు దొరుకుతాయని ధీమాతో లిప్ లాక్ , బెడ్ రూమ్, బికినీ సీన్లలో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఆ మద్య ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పూత్ ఎంత బోల్డ్ సీన్లలో నటించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చినా..తర్వాత సూపర్ హిట్ అయ్యింది. దాంతో పాయల్ కి వరుస ఛాన్సులు వస్తున్నాయి.

తాజాగా హిప్పి సినిమాలో నటించిన దిగంగన సూర్య వన్శి తాను ఆ సినిమాలో ఎందుకు అలా బోల్డ్ సీన్లలో నటించానో చెప్పింది. ఇక కథా పరంగా..కొన్ని సన్నివేశాల పరంగా హిప్పి సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ , శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి . అవన్నీ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకే పెట్టారు తప్ప కావాలని పెట్టలేదని అంటోంది దిగంగన సూర్యవన్శీ .

హిందీ బిగ్ బాస్ 9 లో పార్టిసిపేట్ చేసి సంచలనం సృష్టించిన ఈ భామ చైల్డ్ ఆర్టిస్గ్ గా రాణిస్తూనే ఉంది . ఇక ఇప్పుడేమో బోల్డ్ మూవీ లో నటించి కుర్రాళ్లకు బాగా దగ్గరైంది. ఈ అమ్మడికి తెలుగు లో మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే తెగ ఇష్టమని చెబుతుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించడంలో తప్పులేదని అంటోంది .

Share.