ఇంకా ఓ పాట షూటింగ్ పూర్తి కాలేదు.. ఆ ఒక్క పాట షూటింగ్ పూర్తి కాగానే నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకోనున్నది. అనంతరం పోస్టర్ – టీజర్ రిలీజ్ చేసుకుని భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోనున్న సాహో సినిమాకు బిజినెస్ కోట్లల్లో జరుగుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. సుమారు 350కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి సినిమాను నిర్మిస్తున్నారు.
యూవీ క్రియోషన్స్ నిర్మిస్తున్న ఈసినిమా బిజినెస్ కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలను డిస్ట్రీబ్యూట్ చేయడానికి సిద్ధమయ్యాడు. సాహో సినిమాను రెండు ఏరియాలో హక్కుల కోసం దిల్‌రాజు రూ. 45కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలిసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు నైజాం ఏరియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
ఇంత భారీ డీల్ ఆఫర్ చేసిన దిల్ రాజుకు నైజాం ఏరియాలో పూర్తిస్థాయి పట్టుంది. దిల్రాజును కాదని దాదాపుగా ఎవరు అంత సాహసం చేయలేరనేది సిని వర్గాల టాక్. దిల్ రాజు చేతిలో అనేకమంది బయ్యర్లు, థియోటర్ యజమానులున్నారు. అందుకే దిల్ రాజు నైజాం ఏరియాలో కీలకమైన డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. అందుకే సిని నిర్మాణ సంస్థ దిల్‌రాజు ఇచ్చిన ఆఫర్‌కు ఒప్పకుంటుందా లేక మరో ప్రత్యామ్నయ మార్గం చూసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.