బన్నీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అక్కినేని చిన్నోడు!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తతం సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలు గా ఉన్నవారు..విలన్లుగా, సెకండ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అక్కినేని కుర్రాడు కూడా ఇదే బాట పట్టాడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కరెంట్ సినిమా తప్ప అతనికి ఏ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. దాంతో ఇప్పుడు క్యారెక్టర్, సెకండ్ హీరోగా రావడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సుశాంత్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని సుశాంత్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. రీసెంట్ గా మొదలైన సెకండ్ షెడ్యూల్ షూటింగులో సుశాంత్ కూడా జాయిన్ అయ్యాడు.

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందనీ, టబు .. పూజా హెగ్డే కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనేది మాత్రం కుర్రాడు సస్పెన్స్ లో పెట్టేశాడు. మరి ఈ సినిమా సుశాంత్ కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

Share.