రామానాయుడు కలను నిజం చేస్తున్న నాగ చైతన్య

Google+ Pinterest LinkedIn Tumblr +

తాత కోసమే ఈ సినిమాలో నటిస్తున్నానని ట్విట్టర్లో పోస్టు చేశాడు మనవడు. నన్ను మామయ్యను ఇద్దరిని ఒకే సినిమాలో నటింప చేయాలని ప్రయత్నించి, ఆ ప్రయత్నం సఫలం కాకండానే అనంత లోకాలకు వెళ్ళినప్పటికి నీ కోరికను తీర్చామంటూ ఆ మనమడు పోస్ట్ చేయడం విశేషం. ఇంతకు ఏవరా తాత…? ఎవరా మనవడు…? ఏంటా సినిమా అనుకుంటున్నారా…?

తాత మూవీ మొఘల్గా ఘనతికెక్కిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. మనవడు అక్కినేని నాగ చైతన్యలు. వీరు తాత మనవడు ఎలా అవుతారనే కథా మీ అనుమానం. రామానాయుడు కూతురును అక్కినేని నాగార్జున కు ఇచ్చి వివాహం చేశారు. రామానాయుడు కూతురు, నాగార్జునల గారాల కొడుకే నాగచైతన్య. రామానాయుడు కొడుకు వెంకటేశ్తో మనవడు నాగచైతన్య కలిసి నటించేలా ఓ సినిమాను తీయాలనుకున్నాడట. కాని ఆయన ఆశ తీరకుండానే అనంత లోకాలకు పోయాడు. ఇప్పుడు ఆ బాధ్యతను రామానాయుడు కొడుకు సురేష్బాబు నెత్తికొత్తుకున్నాడు.

తమ్ముడు వెంకటేశ్ తో అల్లుడు నాగచైతన్యతో కలిపి వెంకి మామ సినిమాను రూపొందించాడు సురేష్బాబు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం రామానాయుడు జయంతి. జయంతిని పురస్కరించుకుని ఇదంతా మీకోసమే తాతయ్య అంటూ నాగచైతన్య ట్వీట్టర్లో ట్వీట్ చేస్తూ వెంకిమామ సినిమా పోస్టర్ను పోస్ట్ చేశారు. ఇక రామానాయుడు కొడుకు సురేష్బాబు కూడా మనవడు కొడుకు ఒకే మూవీలో సిల్వర్ స్క్రీన్పై చూడాలన్నది మీకల, అది నిజమయ్యే నాటికి మీరు మాకు దూరంగా వెళ్ళిపోయారు అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశాడు. ఏదేమైనా రామానాయుడు కలను అటు మనవడు, ఇటు కొడుకు తీర్చారు.

Share.