తెలుగు, తమిళ భాషల్లో సమంత క్రేజ్ ఎలాటిదో అందరికి తెలిసినే. ఏమాయ చేసావే సినిమా నుండి మజిలీ వరకు ఆమె ప్రేక్షకుల మనసులు గెలుస్తూనే ఉంది. అక్కినేని ఇంట కోడలిగా మారాక సమంత మరింత రెచ్చిపోతుంది. పెళ్లి తర్వాత సాధారణంగా ఎవరికైనా ఛాన్సులు తగ్గుతాయి కాని సమంత మాత్రం వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది. ఈమధ్యనే మజిలీతో సూపర్ హిట్ అందుకున్న సమంత ఓ బేబీ సినిమా చేస్తుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమా అఫిషియల్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.
నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడ్డది. మిస్ గ్రానీని హిందిలో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందిలో ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో సాహో సినిమా చేస్తున్న శ్రద్ధ కపూర్ తెలుగులో రీమేక్ అవుతున్న కొరియన్ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కొరియన్ సినిమా రైట్స్ కొనేసిన దగ్గుబాటి సురేష్ హిందిలో కూడా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
రానా ఈ సినిమా బాలీవుడ్ లో మానిటరింగ్ చేస్తాడట. మరి సమంత సినిమా వచ్చే నెల రిలీజ్ అవుతుండగా ఇక్కడ రిజల్ట్ ను బట్టి హిందిలో కూడా ఈ సినిమాకు ఓ క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ఇక ఓ బేబీకి మంచి డిమాండ్ ఏర్పడినట్టే.