ఇంకా పది శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు అప్పుడే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ సంచలనాల మయం మొదలు అయ్యింది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఓ మైలురాయి సినిమాలు అయిన బాహుబలి సీరిస్ సినిమాలు తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడం… ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి సూపర్‌స్టార్ హీరోల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమా ఎన్నో సంచలనాలకు అప్పుడే కేంద్రబిందువు కానుంది.
2020 సమ్మర్ టార్గెట్‌గా రిలీజ్ అవుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై అప్పుడే బిజినెస్ అంచనాలు మామూలుగా లేవు. రిలీజ్ డేట్ వచ్చే యేడాది జూలై 31 ఫిక్స్ చేశారు.. ఇక ట్రేడ్ నుంచి అప్పుడే నిర్మాత దానయ్యపై భారీ ఒత్తిళ్లు స్టార్ట్ అయ్యాయట. ఏరియాల వారీగా రైట్స్ తమకే అమ్మాలని చాలా మంది ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏరియాల వారీగా రైట్స్ సొంతం చేసుకునేందుకు ఏకంగా ముగ్గురు టాలీవుడ్ అగ్రనిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీ డీల్ ఆఫర్ వచ్చిందట. సాహో కొన్న దుబాయ్ సంస్థనే సుమారు 65 కోట్ల దాకా ఆఫర్ ఇస్తే దానయ్య రూ.75 కోట్లకు ఏ మాత్రం దిగనని చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి మాత్రం రిలీజ్‌కు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పుడే కంగారు పడవద్దని కూడా దానయ్యకు చెప్పినట్టు ఫిల్మ్‌నగర్ ట్రేడ్ సర్కిల్స్‌లో టాక్ బయటకు వచ్చింది.