తెలుగు చిత్ర సీమ ఇప్పుడు కొందరు కుర్రహీరోలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఒకనాడు చాలీచాలనీ రెమ్యూనరేషన్తో ఎలాగొలా జీవితాలను నెట్టుకొచ్చారు నటీనటులు. ఆనాడు కథే హీరో.. కథ మంచిగుంటే హీరోలతో పనిలేదు.. సినిమా మొత్తం కథ చుట్టూ తిరిగేది.. అప్పుడు దర్శకులు చెప్పినట్లు వింటూ, నిర్మాతలకు సహకరించేవారు హీరోలు.. కాని ఇప్పుడు రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి..
ఆనాడు టాలీవుడ్లో హీరోల డిమాండ్ కన్నా నిర్మాతలు ఇచ్చిందే పుచ్చుకునే ధోరణి ఉండేది. కాని ఇప్పుడు కథ అవసరం లేదు.. కథనం అవసరం లేదు.. అయినా రెమ్యూనరేషన్ మాత్రం కోట్లల్లో ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోలనే డామినేట్ చేసే స్థాయిలో కుర్రహీరోలు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రహీరోలు తమ రెమ్యూనరేషన్ను వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు.
ఇక టాప్ హీరోలు మాత్రం ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లకు పైగా తీసుకుంటున్నారట. అందులో రామ్చరణ్, నాగచైతన్య, ప్రభాస్, మహేష్బాబు, జూనీయర్ ఎన్టీఆర్, బన్నీతో పాటు కొందరున్నారు. ఇక ఇండస్ట్రీలో సొంతగా పైకొచ్చిన అర్జున్రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నానీలు మాత్రం రూ.10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇక శర్వానంద్, నితిన్, వరుణ్తేజ్, రానా వంటి హీరోలు రూ.5కోట్లకు తగ్గకుండా సొమ్ము తీసుకుంటున్నారట. ఇక సాయి ధరమ్ తేజ్, నిఖిల్, అఖిల్తో పాటు పలువురు రూ.3కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఏదేమైనా టాప్ హీరోల నంచి కుర్రహీరోల వరకు కోట్లల్లో కాసులు కొల్లగొడుతున్నారు…