తమిళ స్టార్ డైరెక్టర్ అట్లి దర్శకత్వంలో ఇప్పటి వరకు స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నాడట. తండ్రి కొడుకు పాత్రలో కనిపించి అలరించబోతున్నట్లు సమాచారం. గతంలో హీరో సూర్య s/o కృష్ణన్ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించారు. చాలా సంవత్సరాల తర్వాత తమిళనాట తండ్రి కొడుకుల పాత్రలో విజయ్ నటించబోతున్నాడు. మరి విజయ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అందిస్తుందా అని అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు.
విజయ్ బర్త్ డే సందర్భంగా జూన్ 22న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయనున్నారట. ఇంకా సెట్స్ పైకే రాని ఈ సినిమాపై అప్పుడే కాంట్రవర్సీలు మొదలయ్యాయి. న కథతోనే విజయ్ సినిమాని అట్లీ తెరకెక్కిస్తున్నాడని, నాకు తెలియకుండా నా కథతో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వర్ధమాన దర్శకుడు శివ దక్షిణ భారత ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కథా విషయం నిర్మాత ద్వారా లీక్ అయి ఉంటుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నయనతార నటిస్తుందట..మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.