దగ్గుబాటి రానా ఎప్పుడు విభిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తాడు.. ఎవరు టచ్ చేయని సినిమాల్లో నటించాలని కోరకుంటాడు… రానా ఫలానా పాత్రే చేయాలనే కమిట్ మెంట్ ఏమి పెట్టుకోవడనే టాక్ సిని ఇండస్ట్రీలో ఉంది. విలన్ అయినా, సైడ్ క్యారెక్టర్ అయినా సరే పాత్ర బాగుంటే చాలు… అందుకే బాహుబలిలో విలన్ క్యారెక్టర్కు జీవం పోసాడు రానా… అయితే ఇదంతా ఎందుకు చెప్పుతున్నామంటే రానా కేవలం రాజుల పాత్రలే కాదు, రాక్షస రాజుల పాత్రలను చేయడంలో ముందుంటాని చెప్పడానికే…
ఇక అసలు విషయానికి వస్తే.. రానా ఇప్పటికే రాక్షస రాజు హిరణ్యకశ్యపుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు, స్క్రిఫ్ట్ వర్క్, నటినటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను దర్శకుడు గుణశేఖర్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కెలోపు ఒక సినిమాను చేయాలనే పట్టుదలతో ఉన్నాడు రానా. అందులో భాగంగానే ఇప్పుడు విరాట పర్వం అనే టైటిల్ సినిమాలో నటించబోతున్నాడు. అందుకు తగిన స్క్రిఫ్ట్ వర్క్ పూర్తి చేసుకుని ఈనెలాఖరులో షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఇక ఈ సినిమాను నీది నాది ఒకే కథ సినిమాను చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల నేతృత్వంలో వస్తుంది. నేటి సమకాలిన వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను ఈ చిత్రం ద్వార చూపించాలనే తాపత్రయంతో విరాటపర్వం అనే టైటిల్ను ఖారారు చేశారట దర్శకుడు వేణు ఉడుగుల. వేణు ఉడుగులకు సామాజిక నేపథ్యాలపై, సామాజిక పరిస్థితులపై పూర్తి పట్టున్న దర్శకుడు. తన మొదటి సినిమాలోనే సామాజిక కోణంను టచ్ చేసి విజయవంతం అయ్యాడు. ఇప్పుడు రానా, సాయిపల్లవి జంటగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టబు ఓ మానవ హక్కుల కార్యకర్తగా నటించబోతుండగా, హింది, తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో పూర్తి చేయనున్నారు.