తెలుగు పరిశ్రమలో ఈమధ్య ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అడివి శేష్ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని చూస్తున్నారు. క్షణం, గూఢచారి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి ఎవరు అంటూ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద ఓ ఇంట్రెస్ట్ కలిగేలా చేసుకున్నాడు. అడివి శేష్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు.
ఎవరు సినిమాఉ వెంకట్ రాంజి డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో అడివి శేష్ సరసన రెజినా కసాండ్రా నటిస్తుంది. మర్డర్ మిస్టరీతో సాగే కథగా హంతకుడు ఎవరన్నది కనిపెట్టేలా ఈ సినిమా సాగుతుందట. పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా కూడా కచ్చితంగా అడివి శేష్ కు మంచి ఫలితాన్నే ఇచ్చేలా ఉంది. హీరోగానే కాదు రచయితగా కూడా అడివి శేష్ అదరగొడుతున్నాడు.
గూఢచారి సినిమా పర్ఫెక్ట్ ఇండియన్ జేంస్ బాండ్ సినిమాగా క్రేజ్ తెచ్చుకోగా ఎవరు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాలో అడివి శేష్ సరసన రెజినా నటిస్తుండటం కూడా కలిసి వచ్చే అంశమే. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నా సినిమాల ఎంపికల్లో అమ్మడు తప్పుల తడకల వల్ల సగటు హీరోయిన్ గా మిగిలిపోయింది రెజినా మరి ఎవరు సినిమాతో అమ్మడి లక్ మారుతుందేమో చూడాలి.