రణరంగం సృష్టిస్తున్న శర్వానంద్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ హీరో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు ఫైనల్ గా రణరంగం అని టైటిల్ ఫిక్స్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ రణరంగం శర్వానంద్ ప్రస్థానం సినిమాను గుర్తుచేసేలా ఉంది. టీజర్ లో పెద్దగా ఏం చెప్పకుండా జస్ట్ శర్వానంద్ అతని సపోర్టర్స్ వాకింగ్ చేస్తూ వచ్చారు.

శర్వానంద్ లుక్ కూడా కొత్తగా ఉండేలా ఉంది. దేవా కట్టా తీసిన ప్రస్థానం సినిమాకు రణరంగానికి దగ్గర పోలికలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సినిమా మొత్తం ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండేలా కనిపిస్తుంది. స్వామి రారా సినిమాతో సత్తా చాటిన సుధీర్ వర్మ ఆ తర్వాత తన మార్క్ హిట్ అందుకోలేదు. శర్వానంద్ తో చేస్తున్న ఈ రణరంగం ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సినిమాలో శర్వానంద్ రఫ్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా సినిమా ఆగష్టు 2న రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేయడం విశేషం.

Share.