జూలై 5న దొర‌సాని వ‌చ్చేస్తోంది…

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. దాదాపు ఇప్ప‌టికే 80శాతం షూటింగ్ పూర్తయిన‌ట్లు స‌మాచారం. అందుకే చిత్ర‌యూనిట్ మంగ‌ళ‌వారం రిలీజ్‌డేట్ జులై 5ను అనౌన్స్ కూడా చేసేసింది. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు దొర‌సాని ఇంట్లో ప‌నివాడుగా క‌న‌బ‌డ‌తాడ‌ని స‌మాచారం. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించి చివ‌రికి ఎలా ముగిసింది అనేది తెర‌పై చూపించ‌నున్నారు.

సూర్య‌పేట జిల్లాల్లోని న‌డిగూడ‌లోని ఓ పురాత‌న గ‌డిలో సినిమాను నిర్మిస్తున్నారు. క‌థా బ‌లం ఉన్న సినిమా కావ‌డంతోనే ఈ సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్‌ను ఈ సినిమాలో క‌థానాయ‌కుడిగా ప‌రిచయం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా కూడా 1960 ద‌శ‌కంలో జ‌రిగినట్లుగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆనంద్ అన్న‌య్య దేవ‌ర‌కొండ విజ‌య్ సార‌థ్యంలోనే ముందుకు వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ప‌రిమిత బ‌డ్జెట్‌లోనే అయినా పాత‌కాలం నాటి నేటివిటి ఎక్క‌డా మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. టైటిల్ రోల్‌ను పోషిస్తున్న శివాత్మిక కూడా మంచి న‌ట‌న‌ను పండిస్తున్న‌ట్లు చిత్ర వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్‌ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ రెండో వారం నుంచే సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది.

Share.