టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ వరుస హిట్స్ తో స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ డియర్ కామ్రేడ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తోన్న మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ యువ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా సినిమాకి సరికొత్త వేరియేషన్స్ చూపిస్తోన్న విజయ్, క్రాంతి మాధవ్ సినిమాలో బ్రేకప్ బాయ్ గా కనిపిస్తాడట.
కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఫారెన్ మోడల్ ఇజబెల్ లీట్ నటిస్తున్నారట. ఒక హీరోయిన్ ఉంటేనే ముద్దుల హంగామా చేసే విజయ్ ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా బ్రేకప్ అని పెడుతున్నారట. వివిధ దారుల్లో కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ బాదితుడిగా మిగిలిపోతాడట. అందుకే సినిమాకు కూడా బ్రేకప్ అనే టైటిల్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలో రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉంటుందని సమాచారం. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు బ్రేకప్ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ సినిమాల పంథాలోనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ బ్రేకప్ ఉండబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రాశిఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.