మూర్తి కోసం చిరంజీవి ఎంచేశాడో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

నారాయణ మూర్తి ఈ పేరు వినబడితే చాలు రక్తం ఉడికిపోయేలాంటి పాటు..నక్సలీజం, భూస్వాములపై పోరాటం..రైతులు, కష్టజీవుల జీవితాలు ఇలా ఎన్నో సినిమాలకు ఆయన జీవం పోశారు. విప్లవ దర్శకులుగాపేరు తెచ్చుకున్న నారాయణ మూర్తి ప్రస్తుతం ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం ’తీస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. సాధారణంగా మెగాస్టార్ వస్తున్నారంటే పెద్ద హంగామా..భారీ స్థాయిలో అతిధి మర్యాదలు ఉంటాయని తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే ఆడియో వేడుకకు వచ్చారు మెగాస్టార్.

ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆడియో వేడుకకు వచ్చిన అతిధులకు స్నాక్స్ ఇస్తున్నారు. ఈ సమయంలో నారాయణమూర్తిని చిరంజీవికి పకోడీ ఇచ్చారు. దాంతో అందరూ మెగాస్టార్ పకోడీ తింటారా ఆశ్చర్యంగా చూశారు..కానీ మూర్తి ఇచ్చిన పకోడీ ఎంతో ఆప్యాయంగా సంతోషంగా తిన్నారు చిరంజీవి. తాజాగా సోషల్ మీడియాలో అందుకు సంబందించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Share.