బయోపిక్ల కాలం నడుస్తున్న రోజులివి. ప్రముఖ హీరో, తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర రెండు భాగాలుగా రూపొందించారు. ఎన్టీఆర్ బయోపిక్ లాగానే మరో టాలీవుడ్ హీరో జీవిత చరిత్ర తెరకెక్కనున్నదా అనే అనుమానాలకు తావిస్తుంది ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ వ్యాఖ్యాలు. నటుడు అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తీయాలంటే టాలీవుడ్ హీరో నాగార్జున ఓకే చేస్తే అది పట్టాలమీదికి ఎక్కుతుందని కృష్ణవంశీ అభిప్రాయపడుతున్నారు.
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఇప్పుడు వందేమాతరం అనే సినిమాను రూపొందిస్తున్నారు. వందేమాతరం సినిమా షూటింగ్తో బిజిగా ఉన్న కృష్ణవంశీ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా కు దూరంగా ఉంటున్నారు. చాలా రోజుల తరువాత ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అనేక మంది కృష్ణవంశీని పలు ప్రశ్నలు సంధించారు. అభిమానుల ప్రశ్నలకు కృష్ణవంశీ సావధానంగా సమాదానం చెప్పారు. ఇందులోనే ఓ అభిమాని అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తీయాలని సూచించాడు. అక్కినేని నాగర్జున ఒప్పుకుంటే రెడి అన్నాడట.
అయితే నాగార్జున మాత్రం గతంలో నాన్న గారి బయోపిక్ ఎప్పుడు తీస్తారంటూ పలువురు విలేకరులు ప్రశ్నించాగా నాన్న గారి బయోపిక్ తీయకుండా ఉండటం మంచిదని చెప్పి సంచలనం సృష్టించారు.