టాలీవుడ్ లోకి ఐశ్వర్య రాయ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు మోహ‌న్‌బాబు ఈ పేరు ఎవ‌రికి ప‌రిచ‌యం అక్క‌ర లేనిది. టాలీవుడ్‌లో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వంద‌ల సినిమాల్లో న‌టించి ఆబాల గోపాల‌న్ని త‌న న‌ట‌న‌తో అల‌రించాడు. నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించాడు. ఏ పాత్ర పోషించినా అందులో జీవించి ఆ పాత్ర‌కే ప్రాణం పోసే న‌టుడు మోహ‌న్‌బాబు. త‌న వాక్చాతుర్యంతో ఎన్నో సినిమాల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. అలాంటి మోహ‌న్‌బాబుకు ఇప్పుడు జాక్‌పాట్ త‌గిలింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పొన్నియిన్ సెల్వ‌న్ అనే సినిమాలో మోహ‌న్‌బాబుకు అవ‌కాశం క‌ల్పించాడు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రోజా, బొంబాయి వంటి సినిమాలు ఎంతో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డ్డాయి. మ‌ణిర‌త్నం సినిమాలో నటించే అవకాశం అంద‌రికి రాదు. అది కొంద‌రికే వ‌స్తుంది. అలాంటిది టాలీవుడ్ టాలెంట్ హీరో మోహ‌న్‌బాబుకు వ‌చ్చింది. ఇదోక జాక్‌పాట్ అయితే మోహ‌న్‌బాబుకు మ‌రో డ‌బుల్ ధ‌మాక త‌గిలింది.

టాలీవుడ్‌లో త‌న న‌ట‌న‌తో అంద‌రిని మైమ‌రిపించే మోహ‌న్‌బాబుకు జ‌త‌గా తెలుగు హీరోయిన్లే న‌టించారు. ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమాలో మోహ‌న్‌బాబుకు జ‌త‌గా ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ రాణి ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించ‌బోతున్నార‌నే వార్త హాట్ టాపీక్‌గా మారింది. బాలీవుడ్‌నే త‌న అంద‌చందాల‌తో మెప్పించిన ఐశ్వ‌ర్య‌రాయ్‌తో టాలీవుడ్ న‌టుడు మోహ‌న్‌బాబు న‌టిస్తున్న వార్త‌లు ఫిలిం స‌ర్కిల్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ఐశ్వ‌ర్య రాయ్ మోహ‌న్‌బాబుకు భార్య‌గా న‌టిస్తుంద‌ట‌. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు కూడా నటించనున్నారు. మోహ‌న్ బాబు రాజుగా, ఆయ‌న రాణిగా ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టిస్తుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే భ‌ర్త‌ను చంపిన వారిపై ప‌గ సాధించే విల‌న్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యరాయ్ న‌టిస్తుంది.

Share.