డియర్ కామ్రేడ్ సినిమాలోని రెండో పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాట నెట్లో హల్ఛల్ చేస్తోంది. సెన్సెషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో ఒక పాటను ఇటీవలే విడుదల చేశారు. మొదటిసారి విడుదల అయిన ఈ పాట ఇప్పటికే సంచలనం సృష్టిస్తుంది. ఇక రెండో పాటను ఈమధ్యకాలంలో విడుదల చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో విడుదల చేయలేదు.
భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్బేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం హీరోయిన్ రష్మీక మందన నటిస్తుంది.
డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ, రష్మీక మందన ఇద్దరు కలిసి వానలో జాలీగా పాడుకున్న పాటగా ఈ రెండో పాటను చిత్రించారు. కదలల్లే వేచే కనులే అంటూ సాగే ఈ పాటను బుదవారం విడుదల చేశారు. ఈ పాటను ముందుగానే సాంగ్ ఆఫ్ ద ఇయర్గా విజయ్ దేవరకొండ ప్రకటించడంతో ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సిద్ధ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్లు ఆలపించారు. ఎంతో రొమాంటిక్ మెలోడిగా రూపొందించారు. ఈ పాటను ఏక కాలంలో నాలుగు భాషల్లో విడుదల చేశారు.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ సరసన రష్మిక మందన్న మరో సారి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలోని రెండో పాటను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. తొలి పాట తరహాలనే రొమాంటిక్ మెలోడిగా రూపొందించిన ‘కదలల్లే’ పాటను సిద్ధ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్లు ఆలపించారు.
విజయ్ దేవరకొండ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ ముందుగానే ప్రకటించటంతో ఈ సాంగ్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతసారధ్యంలో రూపొందిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యమందించారు. విజువల్గానూ పాటను పోయటిక్గా తెరకెక్కించారు. ‘కదలల్లే వేచే కనులే’ అంటూ సాగే ఈ పాట నిజంగానే సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనిపించుకుంటుందేమో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఓకేసారి రిలీజ్ చేయనున్నారు. తాజాగా రెండో పాటను కూడా నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.