టాలీవుడ్ లో తన అందచందాలతో నెట్టుకొచ్చిన సుందరి తాప్సీ. తెలుగులో హీరోయిన్గా అనేక మంది హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు ఆనందో బ్రహ్మ, నీవెవరు వంటి చిత్రాల్లో సోలో గా నటించింది. అదే విధంగా దక్షిణాదిలో అనేక భాషలో నటించిన తాప్సీ తరువాత బాలీవుడ్ బాట పట్టింది. ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ప్లాట్ఫాంను తయారు చేసుకుంది. బాలీవుడ్లో కొన్ని కొన్ని సినిమాల్లో నటించిన ఈ బామ ఇటీవల బద్లా సినిమాలో నటించింది. ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్బస్టర్గా నిలిచింది.
బాలీవుడ్లో ఎంట్రి ఇచ్చిన తాప్సీ విజయవంతమైన సినిమాల్లోనే నటించి తన స్టామినాను నిరూపించుకుంది. బాలీవుడ్కు వెళ్ళిన తాప్సీ దక్షిణాదిని మరిచిపోయింది. బాలీవుడ్లో బిజిగా ఉండటంతో దక్షిణాదిలో నటించేందుకు వీలు కావడం లేదన్నది ఈ అమ్మడి మాట. బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో రెచ్చిపోతుంది. అయితే ఇటీవల తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్లోను తనకు తానే సాటిగా నిరూపించుకునేందుకు సిద్ధమవుతుంది.
టాలీవుడ్లో మయూరి అనే సినిమా నయనతార ప్రధానపాత్రగా అశ్విన్ శరవణన్ దర్వకత్వంలో రూపొందింది. ఇప్పుడు అదే దర్శకుడు తాప్సీ ప్రధాన పాత్ర గా గేమ్ ఓవర్ అనే సినిమా తీస్తున్నారు. గేమ్ ఓవర్ సినిమా సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్. ఇది మయూరి సినిమా లాగే హార్రర్ సినిమానే. ఫాంటసీ కలగలిపి ఉంటుంది. ఇందులో తాప్సీ గేమింగ్ నిపుణురాలి పాత్ర చేసిందట. ఆమే రూపొందించిన ఒక గేమ్ వల్లే సమస్యలు రావడంతో అనూహ్య పరిణామాలు ఈ సినిమాలో చోసుచేసుకునే కథాంశంతో రూపొందిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్ నిర్మిస్తుంది. టాలీవుడ్లో రీఎంట్రీతో తాప్సీ జాతకం మారుతుందో లేదో వేచిచూడాల్సిందే.