సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి సినిమా అన్నిచోట్ల మంచి టాక్ సంపాదించింది. రివ్యూస్ కొద్దిగా అటు ఇటుగా వచ్చినా ఫ్యాన్స్ మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు కూడా భారీగానే రాబట్టిందని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా 1900 సెంటర్స్ లో రిలీజైన మహర్షి సినిమా ఫస్ట్ డే 61 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఫస్ట్ డే 31 కోట్ల దాకా మహర్షి షేర్ రాబట్టిందన్నమాట.
ముందునుండి మహర్షి సినిమాపై దర్శక నిర్మాతలు కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. అయితే సినిమా కొందరికి శ్రీమంతుడు పార్ట్ 2 అనేలా ఉన్నా.. సినిమాలో మహేష్ నటన, వంశీ పైడిపల్లి టాలెంట్ ఇలా అన్ని కలిసి సినిమాను హిట్ చేశాయి. ముఖ్యంగా సినిమాలో అల్లరి నరేష్ రవి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫసట్ డే కలక్షన్స్ తో సత్తా చాటిన మహేష్ వీకెండ్ కల్లా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవరసీస్ లో ప్రీమియర్స్ పెద్దగా రాబట్టలేదు.
మహేష్ కెరియర్ లో 25వ సినిమా అయిన మహర్షి నిజంగానే ల్యాండ్ మార్క్ మూవీగా వచ్చింది. మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించిన మహేష్ తన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేసేలా నటించాడని చెప్పొచ్చు. మొత్తానికి మహేష్ మహర్షి అంచనాలను అందుకునేలా ఉంది. మరి ఇక రికార్డుల సంగతి ఫ్యాన్స్ చూసుకుంటారు.