విక్రంవేద రీమేక్.. అవన్ని రూమర్సే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన విక్రంవేద సినిమా రీమేక్ గా తెలుగులో ఓ సినిమా వస్తుందని.. వినాయక్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎఫ్-2 సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విక్రంవేద రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు సురేష్ ప్రొడక్షన్ టీం. సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు తన ప్రొడక్షన్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెళ్లడించారు. విక్రం వేద రీమేక్ లో వెంకటేష్ నటించట్లేదని ప్రస్తుతం వెంకటేష్ వెంకీమామ సినిమా మాత్రమే చేస్తున్నాడని అన్నారు. అప్పటికే ఆ ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుండి వెంకటేష్ ఏంటి నారా రోహిత్ తో మల్టీస్టారర్ చేయడం ఏంటని కొందరు డౌట్ పడ్డారు. ఫైనల్ గా అవన్ని రూమర్సే అన్నది క్లారిటీ వచ్చింది.

కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన ఈ సినిమాలో ఇద్దరు ఢీ అంటే ఢీ అన్నట్టుగా యాక్టింగ్ చేశారు. విక్రం వేద రీమేక్ ఇప్పుడు కుదరకపోయినా వెంకటేష్ ఎప్పటికైనా ఆ సినిమా చేస్తాడు. అయితే మరో హీరో ఎవరన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Share.