ప్రభాస్‌తో కాదు.. ఆ స్టార్ హీరోతో అనుష్క….!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్వీటీగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల తార అనుష్క బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం అమ్మడి డెడికేషన్ అలాంటిది మరి. ఆ తరువాత చాలా తక్కువ సినిమాలు చేస్తున్న అనుష్క మళ్లీ తన స్పీడు పెంచేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే భాగమతి సినిమాతో మరోసారి సోలో హిట్ కొట్టిన అనుష్క ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలను లైన్‌లో పెట్టింది. కాగా ప్రభాస్‌‌‌తో అనుష్క నెక్ట్స్ మూవీలో మరోసారి మెరవనున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. కానీ అందరికీ షాకిస్తూ అనుష్క ఓ స్టార్ హీరోతో ఐటెం సాంగ్‌లో ఇరగ్గొట్టేందుకు రెడీ అవుతోందట.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సైరా చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. చిరు సినిమా కావడంతో స్వీటీ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరుతో కలిసి గతంలో స్టాలిన్ చిత్రంలో అనుష్క ఓ ఐటెం సాంగ్‌లో చిందులేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో చిరుతో మరోసారి డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడంతో అనుష్క ఫుల్ హ్యాపీగా ఉందట. ఇక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తోండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రగ్యా జైస్వాల్‌లు కూడా నటిస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో అనుష్క ఎలాంటి సాంగ్‌లో దర్శనమిస్తుందో చూడాలి.

Share.