మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్ మొదట్లో పెద్దగా విజయాలు అందుకోకపోయినా..తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. పవన్ పీక్ స్టేజ్ లో ఉండగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’సినిమాతో పవన్ కళ్యాన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు..సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నాక్కొంచం తిక్క ఉంది..దానికో లెక్క ఉందంటూ పవన్ పవన్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కొంత కాలం తర్వాత హరీష్ శంకర్ తో మరో సినిమా తీయబోతున్నారని వార్తలు వచ్చాయి..కానీ అది ఆచరణలోకి రాలేదు.
టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ‘వాల్మీకి’ సినిమాను రూపొందించనున్నాడు. చాలా రోజులుగా అతడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తాడని వస్తోన్న వార్తలపై కూడా స్పందించాడు.
పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, అయితే రీసెంట్ గా పవన్ ని కలిసినట్లు వస్తోన్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. నిర్మాతలు ఒకే అయితే..మంచి కథ దొరికితే పవన్ కళ్యాన్ తో తప్పకుండా సినిమా చేస్తానని..అప్పటి వరకు ఏ రూమర్లు వచ్చినా నమ్మోదని హరీష్ శంకర్ మెగా అభిమానులకు తెలిపారు.