అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాగా అందాల భామ సమంతతో పెళ్లి తరువాత చైతూ-సమంత కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో వీరిద్దరి సినిమా ఎలా ఉంటుందా అని యావత్ టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశారు. సినిమా రిలీజ్ అయిన ప్రతి చోటా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూశారు అక్కినేని ఫ్యాన్స్.
ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సమంత, చైతూల మధ్య నడిచే ట్రాక్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవడంతో ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో కలెక్షన్స్‌ను సాధించి చిత్ర యూనిట్‌కు సైతం షాక్ ఇచ్చింది. ఈ సినిమా 4 వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.35.73 కోట్లు వసూలు చేసి చిత్ర నిర్మాతలకు అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ఏరియాల వారీగా నమోదు చేసిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 12.54 కోట్లు
సీడెడ్ – 4.20 కోట్లు
నెల్లూరు – 0.92 కోట్లు
కృష్ణా – 1.82 కోట్లు
గుంటూరు – 2.18 కోట్లు
వైజాగ్ – 4.27 కోట్లు
తూ.గో – 1.74 కోట్లు
ప.గో – 1.36 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 29.03 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.50 కోట్లు
ఓవర్సీస్ -3.20 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 35.73 కోట్లు