ఆ హీరో తన ఫస్ట్ క్రష్ అంటున్న కాజోల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెన్సేషనల్ మూవీస్ లో నటించిన కాజోల్ ఇన్నాళ్లుగా బయటపెట్టిన ఓ టాప్ సీక్రెట్ రివీల్ చేసింది. తన ఫస్ట్ క్రష్ విషయాలను ఈమధ్యనే ఓ టివి షోలో పాల్గొన్న కాజోల్ బహిర్గతం చేసింది. ఇంతకీ కాజోల్ మనసు గెలిచిన ఆ లక్కీ గాయ్ ఎవరు అంటే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. అజయ్ దేవగన్ తో 1994లో పెళ్లి జరుగగా ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించింది కాజోల్.

షారుఖ్ ఖాన్ తో డిడిఎల్ సినిమా సంచలనం విజయం అందుకోగా షారుఖ్, కాజోల్ ల జంట సూపర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ తనకు అక్షయ్ కుమార్ అంటే ఇష్టం ఉండేదని హెన్నా సినిమా ప్రీమియర్ లో ఆయన వస్తారేమో అని ఎదురుచూడగా ఆయన రాలేదని అన్నది. తన ఫస్ట్ క్రష్ విషయాలను బయటపెట్టి కాజోల్ షాక్ ఇచ్చిందని చెప్పాలి.

ఇక బాలీవుడ్ లో సినిమా కెరియర్ అటు ఇటుగా ఉన్నా అమ్మడు చేతినిండా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతుంటే యాడ్స్ లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు.

Share.