థ్యాంక్యూ కేసీఆర్ గారు: శ్రీ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..అమ్మాయిలు హీరోయిన్లు గా రావాలని చూసిన వారిని కొంతమంది దళారులు తమ కామ వాంఛలు తీర్చుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని..అలాంటి వారిలో తాను కూడా ఓ బాధితురాలినే అని కొంత మంది సెలబ్రెటీల బాగోతాలు బయటపెట్టింది నటి శ్రీరెడ్డి. ఆమె చేసిన ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సమయంలో పవన్ కళ్యాన్ పై కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో ఉన్నట్టుండి ఆమెకు సానుభూతి పలికిన వారు వెనక్కి తగ్గారు.

దాంతో శ్రీరెడ్డి చెన్నై వెళ్లిపోయింది..అక్కడ నుంచి సోషల్ మీడియా ద్వారా తన ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్‌ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంపై నటి శ్రీ రెడ్డి స్పందించారు. గతంలో తాను కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం తీసుకు రావడం..దానికోసం ఒక ప్యానెల్ ఏర్పడటంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

నా కల నిజమయ్యింది. ఒక హైదరాబాద్ స్త్రీగా నేను చాలా గర్వపడుతున్నా. నా పోరాటానికి ఒక ఏడాదిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయి. ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు.

Share.