నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న జెర్సీ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెట్ ప్లేయర్‌గా దర్శనమిస్తాడు. నాని ఎప్పుడు చేయని పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అటు ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతుంటే.. ఓ అరవ డైరెక్టర్ మాత్రం ఈ సారి కేవలం ప్రేక్షకులనే కాకుండా హీరో నానిని కూడా భయపెట్టేందుకు రెడీ అయ్యాడు.
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తన బ్రాండ్ మూవీ కాంచన సీరీస్‌లో 3వ సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. కాంచన 3 మూవీ టీజర్, ట్రైలర్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను భయపెట్టేసింది. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 19న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే జెర్సీ, కాంచన 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఏదేమైనా రెండు సినిమాలో వేసవి సీజన్లో పోటీ పడుతుండటంతో ఈ రెండు చిత్రాలలో ఏదీ విజయం సాధిస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు తెలుగు ఆడియెన్స్. మొత్తానికి నానిని భయపెట్టేందుకు కాంచన 3 అన్ని విధాలా రెడీ అయ్యింది.