బోయపాటికి బడ్జెట్ లిమిట్ పెట్టిన బాలయ్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ రాబోతుంది. హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమా త్వరలో ముహుర్తం పెట్టనున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కూడా బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే బోయపాటికి ఈ సినిమా బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ పెట్టాడట బాలకృష్ణ.

ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా నిర్మిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ బోయపాటి 70 కోట్ల దాకా పెడదామని చెప్పగా.. 50 కోట్లకు లోపే ఫినిష్ చేయమని చెప్పాడట. అంతకుమించి వద్దే వద్దని చెప్పాడట. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా కూడా రెండు పార్టులు కలిపి 60 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించారు. అయితే కథానాయకుడు బిజినెస్ బాగానే జరిగినా వసూళ్లు మాత్రం పెద్దగా రాబట్టలేదు. అందుకే ప్రొడక్షన్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేలా చూస్తున్నారు.

బోయపాటి, బాలకృష్ణ సినిమా అంటే ఆడియెన్స్ లో అంచనాలు కూడా భారీగా ఉంటాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్ చవిచూసిన బోయపాటి బాలయ్యతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Share.