హీరో మహేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ పై అనేక పుకార్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించాయి. ఇప్పటికే మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టిడిపి ఎంపి గా ఉన్నారు. అలాగే మహేష్ చిన్నాన్న ఆదిశేషగిరిరావు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇక అప్పటి నుంచి మహేష్ బాబు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టిడిపి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నాడని కూడా వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.
ఇంకేముంది మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అయ్యిందని ఆయన అభిమానులు కూడా హడావిడి మొదలు పెట్టేశారు. అయితే ఈ విషయంపై మహేష్ స్పందించకపోయినా… ఆయన భార్య నమ్రత మీడియా ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నారని …ఆయనకు రాజకీయాల్లోకి వచ్చి తీరుబడి కానీ … ఆసక్తి గానీ లేవని చెప్పారు.
అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ..కుటుంబం కోసం సమయం వెచ్చించే మనిషి మహేష్ అని నమ్రత క్లారిటీ ఇచ్చారు. మహేష్ కు చాలా మొహమాటం అని …నాతోనే సరిగ్గా మాట్లాడారని అటువంటిది రాజకీయాల్లోకి వచ్చి ఇక ప్రసంగాలు ఎలా చేస్తారని నమ్రత చెప్పుకొచ్చారు.