చరిత్ర సృష్టించిన కన్నడ హీరో యశ్.. కె.జి.ఎఫ్ టోటల్ తెలుగు కలక్షన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడలో స్టార్ గా ఎదుగుతున్న యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్. 2018 డిసెంబర్ 21న రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. కన్నడ సినిమానే అయినా తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగులో ఏ కన్నడ సినిమా సృష్టించని రికార్డ్ యశ్ కె.జి.ఎఫ్ సృష్టించింది. 5 కోట్ల బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా టోటల్ రన్ లో 12 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. అసలేమాత్రం తెలుగు వారికి పరిచయం లేకున్నా యశ్ అదరగొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర ఎక్కువ ఉందని చెప్పొచ్చు.

50, 60 కోట్లు కలెక్ట్ చేస్తేనే కన్నడలో అదో పెద్ద రికార్డ్ అలాంటిది కె.జి.ఎఫ్ సినిమా టోటల్ గా 260 కోట్లు రాబట్టింది. కన్నడలో ఏ హీరో సృష్టించని రికార్డుని తన పేరున రాసుకున్నాడు యశ్. ఇక కె.జి.ఎఫ్ తెలుగు టోటల్ కలక్షన్స్ ఏరియాల వారిగా ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 4.80 కోట్లు

సీడెడ్ : 2.40 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.45 కోట్లు

గుంటూరు : 0.90 కోట్లు

ఈస్ట్ : 0.72 కోట్లు

వెస్ట్ : 0.60 కోట్లు

కృష్ణా : 1.10 కోట్లు

నెల్లూరు : 0.30 కోట్లు

టోటల్ కలక్షన్స్ : 12.27 కోట్లు

Share.